Telugu News

న‌ర్సంపేట దుర్ఘ‌ట‌న‌పై మంత్రి ఎర్ర‌బెల్లి తీవ్ర దిగ్భ్రాంతి

మృతులకు సంతాపం, వారి కుటుంబాల‌కు సానుభూతి

0

న‌ర్సంపేట దుర్ఘ‌ట‌న‌పై మంత్రి ఎర్ర‌బెల్లి తీవ్ర దిగ్భ్రాంతి

మృతులకు సంతాపం, వారి కుటుంబాల‌కు సానుభూతి

ఘ‌ట‌న పూర్వాప‌రాల‌పై అధికారుల‌తో మాట్లాడిన మంత్రి

(వరంగల్  విజయం న్యూస్):-

వెంట‌నే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, క్ష‌త గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశాలు
బాధితుల‌ను ప్ర‌భుత్వ ప‌రంగా ఆదుకుంటామ‌ని హామీవరంగల్ జిల్లా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గం ఖానాపూర్ వ‌ద్ద‌ ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఐదుగురు మృతి చెంద‌డంపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. వెంట‌నే సంబంధిత అధికారుల‌కు ఫోన్ చేసి, జ‌రిగిన ఘ‌ట‌న పూర్వాప‌రాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని తెలిపారు. వారి బంధువుల‌కు త‌న సానుభూతి ప్ర‌క‌టించారు. క్ష‌త గాత్రుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

also read :-నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పాత నేరస్తుడు పరారీ

పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు పర్శతండా నుంచి నర్సంపేటకు ట్రాక్టర్ లో వెళ్తుండగా.. ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులోని చెరువు కట్టపై డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టర్ కట్ట కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ.. మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా.. ఇద్దరు పురుషులు ఉన్నారు. చ‌నిపోయిన వారి వివ‌రాలుః జాటోతు గోవింద్ (55), జాటోతు బుచ్చమ్మ(35), గుగులోతు స్వామి(40), గుగులోతు కాంతమ్మ(38), గుగులోతు సీత (30). కాగా ఈ ఘ‌ట‌న ప‌ట్ల మంత్రి తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ప్ర‌యాణీకులు, ప్ర‌జ‌లు, పోలీసు అధికారులు జాగ్ర‌త్త వ‌హించాల‌ని సూచించారు.