Telugu News

రాధేశ్యామ్‌ ఫెయిల్యూర్‌పై పూజాహెగ్డే నిర్వేదం

విజయం సినిమాన్యూస్

0

రాధేశ్యామ్‌ ఫెయిల్యూర్‌పై పూజాహెగ్డే నిర్వేదం

(విజయం సినిమాన్యూస్);-

సినిమా పెయిలూర్, సక్సెస్ లను ముందే గ్రహించలేమని, సినిమా తలరాతలను అసలు ఊహించలేమని సినిహీరోయిన్ పూజా హెగ్దే అన్నారు. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం? రాధేశ్యామ్‌. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అంతగా అందుకోలేకపోయింది. తొలి మూడు రోజులు భారీ వసూళ్లు నమోదు చేసినా ఆ తర్వాత డీలా పడిపోయింది. ఇక బాలీవుడ్‌ అయితే ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది.

also read :-టీఆర్పీ రేసులో దూసుకపోతున్న‘‘అఖండ’’

పూర్తి ప్రేమకథ చిత్రమైనప్పటికీ ఒక్క యాక్షన్‌ ఎలిమెంట్‌ కూడా లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారిపోయింది. ప్రభాస్‌, పూజా హెగ్డే వంటి స్టార్స్‌ ఉన్నా అనుకన్న రిజల్ట్‌ మాత్రం? రాలేదు. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి పూజాహెగ్డే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు మనకు యావరేజ్‌ అనిపించినా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతాయి. మరికొన్ని మనకు బాగా నచ్చినా రిజల్ట్‌ అనుకున్నట్లు ఉండకపోవచ్చు. ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది ముందుగానే రాసి పెట్టి ఉంటుంది. అలాగే జరుగుతుంది. రాధేశ్యామ్‌ విషయంలో కూడా అదే జరిగింది. బాక్సీఫీస్‌ వద్ద సినిమా తలరాత మారిపోతుంది అని బలంగా నమ్ముతాను అంటూ చెప్పుకొచ్చింది.

please subscribe this chanel smiling chaithu